దేశవ్యాప్తంగా కోటీశ్వరుల కుటుంబాల సంఖ్య రెట్టింపు అవుతోంది. 2021- 2025 మధ్య మహారాష్ట్రలో 194 శాతం అంటే లక్షా 78 వేల 600 కుటుంబాలు కోటీశ్వరుల జాబితాలో చేరగా, ఈశాన్య ప్రాంతం చిత్రం అందుకు విరుద్ధంగా కన్పిస్తోంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియ న్ డాలర్ల వైపు దూసుకువెళ్తుండగా, పుష్కలంగా వనరులు ఉన్న సరిహద్దు రాష్ట్రాలు అభివృద్ధి చెందక పోవడం, జాతుల ఘర్షణలు, మౌలిక సౌకర్యాల లోటు తో సతమత మవుతోంది. ఇక్కడి రాజకీయనాయకులు మాత్రం జాతీయ దిగ్గజాలతో పోటీగా సంపద కూడబెట్టుకుంటున్నారు. రాజకీయాలను లాభదాయకంగా మార్చుకుంటున్నారు. ఈ వ్యాసం ఈశాన్యరాష్ట్రాలలో అతి ధనవంతులుగా నాయకుల పెరుగుదలను పరిశీలిస్తుంది. ఇది ఈ ప్రాంతంలోని నాలుగున్నర కోట్ల మంది ప్రజల దిక్కుతోచని స్థితిలో ఎలా ఉంచిందో పరిశీలిస్తుంది.
ఈశాన్య భారతంలో 8 రాష్ట్రాలు – అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర- లో రాజకీయాలు చాలాకాలం అధికారం, పోషణతో ముడిపడ్డాయి. కానీ, ఈమధ్య కాలంలో ఎన్నికైన ప్రజా ప్రతినిధుల ఆస్తుల విస్పోటనం సంభవించింది. ఇది జాతీయ స్థాయిలో కోటీశ్వరుల ఎదుగుదలను ప్రతిబింబిస్తోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఏడిఆర్ ) ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ఈ ప్రాంతంలో అత్యంత సంపన్న నాయకుడు. 2025లో ఆయన డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తులురూ. 1,500 కోట్లకు పైగానే. 2019లో అది రూ. 163 కోట్లు. ఆశ్చర్యకరమైన పెరుగుదల ఇది. 2016 నుంచిబిజేపీలో ఉన్న ఖండు రియల్ ఎస్టేట్, ఉద్యానవనాల వెంచర్ లు, కుటుంబ వ్యాపారాలే తన సంపద పెరుగుదలకు కారణం అంటున్నారు.
కానీ, రాష్ట్రంలో ఖనిజ సంపద ఉన్న కొండప్రాంతాలలో భూ లావాదేవీలతోనే ఈ సంపద పెరిగిందని విమర్శకులు సూచిస్తున్నారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెనుకబడిలేరు. ఆయన ఆస్తులు 2025 నాటికి రూ. 1,200కోట్లకు పెరిగాయి. దశాబ్దం క్రితం రూ. 90 కోట్లుగా ఉన్నాయి. శర్మ నిర్వహించే పోర్ట్ ఫోలియోలో ఫార్మస్యూటికల్స్, టీ ఎస్టేట్ లు, ఉండగా, విద్యా ట్రస్ట్ లలో ఆయనకు వాటాలు ఉన్నాయి. కాగా, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో గతంలో ఆయన ఆరోగ్య శాఖమంత్రిగా ఉండగా ఇచ్చిన కాంట్రాక్టులలో అక్రమాలు జరిగినట్లు తేలింది. త్రిపుర సిఎం మాణిక్ సాహా తన ఆస్తులు రూ. 800 కోట్లు గా ప్రకటించారు. వీటిలో ఎక్కువభాగం రియల్ ఎస్టేట్ లు, డెంటల్ క్లీనిక్ లనుంచి వచ్చినవే. నాగాలాండ్ లోని సిఫియు రియో ఆస్తి రూ. 450 కోట్లుగా ఉంది. కేంద్ర రహదారి ప్రాజెక్టుల నుంచి లబ్ధిపొందిన నిర్మాణ సంస్థలే ఇందుకు కారణంగా నిలిచాయి.
ఏడిఆర్ చేపట్టిన 2025 ఎన్నికల అఫిడవిట్ల విశ్లేషణ చెబుతున్న గణాంకాల ప్రకారం భారతదేశంలోని టాప్ నలుగురు సీఎంలలో ఇద్దరు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులే. జాతీయస్థాయిలో ఖండు రెండో స్థానంలో, సాహా నాల్గో స్థానంలో ఉన్నారు. మహారాష్ట్రలో పట్టణ మిలియనీర్ల పెరుగుదలకు సాంకేతికత, ఆర్థికం కారణాలు కాగా, అందుకు భిన్నంగా, ఈశాన్య రాజకీయనాయకుల సంపద ప్రజా ప్రయోజనాలకు ఆజ్యం పోసే వనరులు, – కలప, జలశక్తి, వాణిజ్యం నుంచి వస్తోంది.
2025 ఫేస్ బుక్ పోస్ట్ ప్రకారం ఈశాన్యభారతంలో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ లో టాప్ 10 మంది ధనవంతుల రాజకీయనాయకులు టాప్ లో ఉన్నారు. వారిలో ఖండు ముందున్నారు.ఎమ్మెల్యేలు లాంబో తయెంగ్, (రూ. 1,200 కోట్లుఘ టెసాంగ్ సేతి (రూ. 950కోట్లు ) ఉన్నారు. వీరిలో చాలామంది మైనింగ్ రాయతీలలో చిక్కుకున్నారు.
ఈ సంపద పెరుగుదల దేశవ్యాప్తంగా జరుగుతున్నదే. భారతదేశంలో 119 మంది కోటీశ్వర ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తిలో (జిడిపి) ఈశాన్య రాష్ట్రాలన్నీ కలిపి 3శాతం కన్నా తక్కువే. ప్రధాని నరేంద్రమోదీ 8 ఈశాన్య రాష్ట్రాలను _ అష్టలక్ష్మి- గా ప్రశంసించారు. టీ, పెట్రోలియం, ఎకో టూరిజం దృష్ట్యా అన్నప్పటికీ, ఆ వ్యాఖ్యలో వ్యంగ్యం స్పష్టమవుతోంది. అష్టలక్ష్మి రాజకీయనాయకులపైనే దయచూపుతోంది. పేద, అట్టడుగు వర్గాలను కాదు. భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రాలలో పబ్లిక్ సర్వెంట్లు కోట్లు ఎలా కూడబెడుతున్నారు- దీనికి సమాధానం అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కబ్జాలకు వత్తాసే. ఇక్కడ రాజకీయ పదవి ప్రైవేటు ఆర్జనకు ప్రధాన ద్వారంగా పని చేస్తోంది. ఈశాన్య ప్రాంతంలో, నార్త్ ఈస్ట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ స్కీమ్ (ఎన్‌ఇఐడిఎస్) వంటి పథకాల ద్వారా కేంద్రం నిధులు ప్రవహిస్తాయి.
Also Read : దక్కన్ సిమెంట్‌లో యుద్ధకాండ
మూలధనం పెట్టుబడిలో 30 శాతం సబ్సిడీ వస్తుంది. రాజకీయ నాయకులు కీలక పాత్రవహించి, బంధువులు, స్నేహితులకు లైసెన్స్ లు ఇస్తారు. భూ కేటాయింపులు – అరుదైన కలప చెట్లతో కూడిన అటవీ భూముసను అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో లీజుకు తీసుకుంటారు. ఖండు కుటుంబ సంస్థలు బహుళ జలవిద్యుత్ కాంట్రాక్టులు పొందాయి. 2024 కాగ్ నివేదిక రూ. 500 కోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. అసోంలో శర్మ సహచరులు టీ వేలంలో పెత్తనంచేస్తున్నారు. అక్కడ ఎగుమతి కోటాల కోసం లంచాలు నిత్య కృత్యంగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్, సామాజిక ప్రాజెక్టులను అవినీతి హాట్ స్పాట్ లుగా మారాయని అధ్యయనంలో తేలింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం ఈశాన్య రాష్ట్రాల లంచం రేట్లను 65 శాతంగా అంచనా వేసింది.
ఇది జాతీయ సగటు 62 శాతం కంటే ఎక్కువ. పర్మిట్ల కోసం స్పీడ్ మనీ సగటున ఉద్యోగం, కాంట్రాక్టులకు రూ. 30 వేల నుంచి లక్షా 50 వేలు ఉంటోంది. ఇది అవకాశవాదం కాదు. క్రమబద్దంగా సాగుతోంది. 1991 లో ఆర్థికవ్యవస్థ సరళీకరణ తర్వాత ఈ ప్రాంతం భౌగోళిక, రాజకీయ పరిస్థితుల దృష్ట్యా 2018 కార్నేగీ ఎండో మెంట్ నివేదికలో పేర్కొన్నట్లుగా ఆమోదాలపై ఆధారపడే మధ్యస్థ సంస్థలకు ఓ వ్యవస్థ ఏర్పడింది. రాజకీయ నాయకులు దీనితో లబ్ది పొందారు. మణిపూర్ లో జాతి హింస నేపథ్యంలోనే సీఎం బీరేన్ సింగ్ (రూ10 కోట్లతో) అత్యంత పేద ఈశాన్య ముఖ్యమంత్రి. కానీ రూ. 300 కోట్ల వెంటర్లతో ఆయన కుటుంబం సంబంధం కలిగిఉంది.) సహాయ నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు.
తిరుగుబాటు – నాగాలాండ్ లోని ఎన్ ఎస్ సిఎన్ నుంచి అసోం లోని యుఎల్ ఎఫ్ ఏ వరకూ జాతి తిరుగుబాట్లు సాగాయి. దోపిడీ ముఠాల నిధులు ప్రచారాలకు ఉపయోగ పడ్డాయి. రాజకీయాలు ఈ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. మేఘాలయలో ముకుల్ సంగ్మా కుటుంబం మైనింగ్ లాబీలను నియంత్రిస్తుంది. సిక్కింలో ప్రేమ్ సింగ్ తమంగ్ ఆస్తులు 2019 తర్వాత 300శాతం పెరిగాయి. 2025 ఉఖ్రుల్ టైమ్స్ నివేదిక ప్రకారం భారతదేశంలోని నలుగురు ధనవంతులైన సీఎంలలో ఇద్దరు ఈశాన్య ప్రాంతాలకు చెందినవారు. నాయకులు అభివృద్ధి చెందుతుండగా, రాష్ట్రాలు కుదేలయితున్నవైరుధ్యం ఇది. ఈశాన్య రాష్ట్రాల దురదృష్టం రాజకీయ దురాశ అభివృద్ధిని దెబ్బతీస్తోంది. 2014 నుంచి యాక్ట్ ఈస్ట్ పాలసీ కింద కేంద్ర రూ. 3 లక్షలకోట్లు ఇచ్చినా, ఈ ప్రాంతం తలసరి ఆదాయం రూ. 1.2 లక్షల వరకే ఉంది. ఇది జాతీయ సగటులో సగం. నిరుద్యోగం 12 శాతం ఉంటే, జాతీయస్థాయిలో 6 శాతం ఉంది.
మౌలిక సదుపాయాలలోనూ వెనుకబడి ఉన్నాయి. 2025 నీతీ ఆయోగ్ అంచనా ప్రకారం 40 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. 60 శాతం గ్రామాలు విద్యుత్ అంతరాయంతో కుదేలవుతున్నాయి. ఎకనమిగ్ అండ్ పొలిటికల్ వీక్లీ 2021లో చేసిన అధ్యయనం ప్రకారం, మిజోరాంలో పాఠశాలల నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని అసంపూర్తిగా ఉన్న ఈశాన్య ప్రాజెక్టులన్నీ 40 శాతం లీకేజీలతో అధ్వన్యస్థితిలో ఉన్నాయి. దేశంలో మొత్తం ఎమ్మెల్యేల సంపద రూ.73,348 కోట్లు తో పోలిస్తే, ఈశాన్య రాష్ట్రాల మొత్తం బడ్జెట్ రు 2.5 లక్షలకోట్లు మరీ కనాకష్టంగా ఉంది. అసోం చమురు క్షేత్రాలనుంచి ఏటా 5 బిలియన్ల డాలర్ల మేరకు దిగుబడి వస్తుంటే, దాని జనాభాలో 25శాతం మంది పేదరికం దిగువన నివసిస్తున్నారు.
జలవిద్యుత్ ప్రాజెక్టులు ఏటా 50 వేల మంది ఆదివాసిలను పరిహారం లేకుండా నిర్వాసితులను చేసాయి. దీంతో తిరుగుబాట్లకు ఆజ్యం పోస్తున్నాయి. 2023 నుంచి మణిపూర్ లో మాత్రమే ఉన్నత వర్గాల భూ కబ్జాలవల్ల తీవ్రవాదం, జాతి ఘర్షణలు రెండు లక్షలమంది నిరాశ్రయులయ్యాయి. యువతల వలసులు పెరుగుతున్నాయి. ఏటా 15 లక్షలమంది ఈశాన్యకార్మికులు దేశంలో ఇతర నగరాలకు తరలివస్తున్నారు.మౌలిక సదుపాయాలు (భారత్ మాల కింద రూ. 50 వేల కోట్లు ) కమ్యునిటీల కంటే కాంట్రాక్టర్లకే ప్రయోజనం చేకూరుస్తున్నాయి. రాజకీయ నాయకుల సంపద పెంచుతున్నాయి. భారతదేశం లో కోటీశ్వరుల సంఖ్య రెట్టింపు కావడం ఓ విజయం కానీ, ఈశాన్య ప్రాంతంలో ఇదో వైఫల్యం.
కొంతమందికి శ్రేయస్సు, చాలా మందికి పేదరికం. ఖండు, శర్మ వంటి అతి ధనవంతులైన రాజకీయ నాయకులు సమాన వృద్ధిని పణంగా పెట్టి అధికారం సంపదను పెంచుకుని, అధికారాన్ని స్థిరపరచే వ్యవస్థగా మారుతున్నారు. ఈ చక్రాన్ని బ్రేక్ చేసేందుకు సంస్కరణలు అత్యవసరం. విచక్షణను అరికట్టడానికి ప్రాజెక్టుల ఆమోదాలను డిజిటలైజ్ చేయాలి. ఏఐ ఆడిట్ తో ఆస్తులను బయటకు తీయాలి, బ్లాక్ చైన్ ట్రాకింగ్ ద్వారా నిధులను కట్టడి చేయాలి. నిజమైన మార్పునకు రాజకీయ సంకల్పం అవసరం. భారతదేశం 2047 స్వాతంత్రం శతాబ్ది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఈశాన్యప్రాంతం – భారతదేశ అష్టలక్ష్మి – ఉన్నత వర్గాల నుంచి కలుపుకొని పోయే ఇంజిన్ లను మారాలి. అప్పుడే ఆ ప్రాంతంలోని లక్షాధికారులలో రాజకీయ నాయకులు మాత్రమేకాదు. ప్రజలు కూడా ఉంటారు. అంతవరకూ సరిహద్దు సంపద ఎండమావిగానే ఉంటుంది. అందనంత దూరంలో ఉంటుంది.
- గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్)
- రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు