హెచ్-1బీ వీసా ఫీజులను ఏటా లక్ష డాలర్లకు పెంచడం భారత ఐటీ రంగంలో కలకలం రేపింది. ఈ నిర్ణయం భారత ఐటీ కంపెనీల ఆదాయాన్ని, లాభాలను తగ్గించడంతో పాటు, ఉద్యోగుల నియామకాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సేవల రంగంపైనా పన్నులు విధించే ‘ట్రంప్ సుంకం 2.0’కు ఇది నాంది కావచ్చునని అంటున్నారు.