హైదరాబాద్: సింగరేణి సంస్థ బొగ్గు గని మాత్రమే కాదని, అది ఒక ఉద్యోగ గని అని డిప్యూటి సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. సింగరేణి సంస్థ రాష్ట్రప్రభుత్వానికి ఆత్మవంటిదని అన్నారు. సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్నయాజమాన్యానికి కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సింగరేణి యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని, రాష్ట్రప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నాయని అన్నారు.
సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించామని, గత పదేళ్లుగా సింగరేణి సంస్థ కొత్త బ్లాక్ లకు వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయం తీసుకున్నామని, ఒక్కో కార్మికుడికి బోనస్ రూ. 1,95,610 పంపిణీ జరుగుతుందని అన్నారు. మొత్తంగా రూ. 819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని, సింగరేణి సంస్థ మొత్తంగా రూ.6,394 కోట్లు ఆర్జించిందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Also Read : ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుంటాం: మంత్రి ఉత్తమ్