మేషం: మేష రాశి వారికి ఈ వారం ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. మీరు సాధించాలనుకున్న కోరిక నెరవేరుతుంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ పైన నరదృష్టి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తి కి సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశాలలో ఉన్న వారు ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్త వహించాలి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. హోటల్ మేనేజ్మెంట్, టీచర్స్, చార్టెడ్ అకౌంటెంట్ వారికి, సినీ కళా రంగం వారికి కాలం అనుకూలంగా ఉంది. రాజకీయరంగంలో ఉన్న వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు విద్యాపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు కొంచెం ఆలస్యమవుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ విద్య వ్యాపారం పట్ల అవగాహన ఏర్పరచుకుంటారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. నవరాత్రులలో అమ్మవారికి ఆరావలి కుంకుమతో కుబేర కుంకుమతో కుంకుమార్చన చేయండి. ఇలా చేయడం వలన అమ్మవారి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్యా రెండు కలసవచ్చే రంగు మెరూన్.
వృషభం: వృషభ రాశి వారికి ఈ వారం చాల అనుకూలంగా ఉంది. రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేయదలచిన వారు ఈ వారం చేయవచ్చు. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సాధించాలనే భావన మీలో ఉంటుంది. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాతలు ఎక్కువగా ఉంటాయి. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కాంట్రాక్టులు లీజులు లైసెన్సులు రెన్యువల్స్ లాభస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ రాశిలోని విద్యార్థిని విద్యార్థులకు విదేశీ విద్యలో కానీ ఉన్నత విద్యలో కొంత ఆటంకం ఏర్పడుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనయోగం ఉంది. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు వహించాలి. తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. ఈ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కావున గట్టిగా ప్రయత్నం చేస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు స్కైబ్లు.
మిథునం: మిధున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వివాహ ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. సంబంధాలు చేతి దాక వచ్చి చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ధనం ఎంత వచ్చినా నిలకడగా ఉండదు. ఒకటికి రెండింతలు ఖర్చు ఉంటుంది ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్నాకే ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో కొన్ని చికాకులు ఉండే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి. కుటుంబ విషయాలు బాగుంటాయి. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికి అందుతుంది. నూతన పెట్టుబడులకు దూరంగా ఉండండి. వ్యాపార సంబంధిత విషయాలు సానుకూల పడతాయి. కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వాళ్లకు కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు బాగున్నాయి. విదేశీ సంబంధిత వ్యవహారాలు సానుకూలపడతాయి. మెడికల్ రంగంలోని వారికి కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాలపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. భూసంబంధిత విషయాలు సానుకూల పడతాయి. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. జీవిత భాగస్వామి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళండి. దైవదర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఈ నవరాత్రులలో అమ్మవారికి కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయించండి. అదేవిధంగా గుగ్గిలం పొడితో కార్యాలయాలలో ఇంట్లో ధూపం వేసుకోండి. నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించండి. ఈ రాశి వారు ప్రతి రోజు ఓం నమశ్శివాయ వత్తులతో , తామరవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఆరు కలిసి వచ్చే రంగు మెరూన్.
కర్కాటకం : కర్కాటక రాశి వారికి ఈ వారం మిత్రమా ఫలితాలు గోచరిస్తున్నాయి. వారం ప్రథమార్తం కాలం అనుకూలంగా లేదు. పదిమందికి మంచి చేయాలని అనుకున్న మిమ్మల్ని వెనక్కి లాగాలనుకునే వాళ్ళు అప్రతిష్ట పాలు చేయాలనుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది. బంగారానికి సంబంధించి భూ సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. కాంట్రాక్టు పనులు సబ్ కాంట్రాక్టు పనులు లభిస్తాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఏదైనా కార్యక్రమం తలపెట్టే ముందు వెంకటేశ్వర స్వామి ఆరాధన గాని శివాలయంలో రుద్రాభిషేకం గాని చేయించి మొదలుపెట్టండి మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన వాతావరణముంది. మానసికంగానూ శారీరకంగానూ కొంత ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు విద్యాపరంగా చక్కగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది కావున ఒకటికి రెండుసార్లు ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోండి. వివాహం కాని వారు వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు సుబ్రమణ్య స్వామికి అభిషేకాలు చేయించండి. ఈ రాశి జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. విదేశీ వ్యాపారాలు కలిసి వస్తాయి. మీరు చేసే ప్రయత్నాలు మీకు కలిసి వస్తాయి. భూ క్రయవిక్రయాలకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రాశి వారు ప్రతి రోజు ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. ఈ రాశి వారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం కానీ లలిత సహస్రనామాలు చదవటం వినటం ఏదో ఒకటి చేయండి దీనివలన ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసివచ్చే రంగు తెలుపు.
సింహరాశి : సింహ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపార ప్రారంభానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి. జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. లాయర్స్ కి ఫైనాన్స్ సెక్టార్ లో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ధనం అధికంగా ఉంటుంది నూతన పెట్టుబడులు పెడతారు. పెట్టుబడి వ్యవహారాలు కలిసి వస్తాయి. వడ్డీ వ్యాపారులకు అనుకూలంగా లేదు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు కొంతకాలం ఆగటం మంచిది. జాతక పరిశీలన చేసుకున్నక ముందుకు వెళ్ళటం మంచిది. విదేశీ విద్య వారికి, వైద్య వృత్తిలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారు కూడా ఈ నవరాత్రులలో ఒక శుభవార్త వింటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తిఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి నరదృష్టి అధికంగా ఉంటుంది చేసిన పని రెండుసార్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆరోగ్యానికి సంబంధించి కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉదర సంబంధిత ఇబ్బంది కూడా ఉంటుంది. సహోదరి సహోదరుల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వహించండి. సంతాన అభివృద్ధి చక్కగా ఉంటుంది. ఈ నవరాత్రులలో ఈ రాశి వారు ప్రతిరోజు ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయటం మంచిది. ప్రతిరోజు లలిత సహస్రనామం పారాయణం కానీ వినటం కానీ చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు.
కన్య: కన్య రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు. ఉద్యోగస్తులకు కూడా పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. సంబంధాలు చేతిదాకా వచ్చి చేజారి పోతాయి. ధనo విషయంలో చాలా జాగ్రత్త వహించండి. మీకున్న తెలివితేటలకు మంచి అవకాశాలు వస్తాయి. మీకు రావలసిన ధనం సమయానికి చేతికి వస్తుంది. ఉద్యోగo మారాలనుకునేవారు కొంతకాలం వేచి ఉండటం మంచిది. ఈ రాశి వారు కోపతాపాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రభుత్వపరంగా మీకు రావలసిన బెనిఫిట్స్ వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి పదవి వచ్చే అవకాశం ఉంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కూడా అనుకూలంగా ఉంది. డాక్యుమెంట్స్ విషయంలో తగు జాగ్రత్త వహించండి కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగ మార్పిడి కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరియర్ పరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో కొన్ని కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారు ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేయటం కానీ వినడం కానీ చేయాలి . దైవదర్శనాలు ఎక్కువగా చేసుకోవాలి. ఈ నవరాత్రులలో అమ్మవారికి ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో కుంకుమార్చన జరిపించండి. మీ సమయస్ఫూర్తి వల్ల మీరు కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చినాకే ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ తామరవతులతో దీపారాధన చేయటం, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం మంచిది. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రల విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరించండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఎనిమిది కలిసి వచ్చే రంగు లైట్ ఎల్లో.
తుల: తులారాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి ఉన్నప్పటికీ ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలుస్తాయి. వైద్య వృత్తిలో ఉన్నవారికి కాస్మోటిక్ రంగంలో ఉన్నవారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఎక్కువగా మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. మంచి సంబంధం కుదురుతుంది అయినప్పటికీ జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది ప్రయత్నాలు చేసుకోవచ్చు. అవసరం అయితే తప్ప లోన్ లోకి వెళ్లకపోవడం మంచిది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రేమ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మోసపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. సొంత నిర్ణయాలు అంత కలిసి రావు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మంచి యూనివర్సిటీలో సీటు లభించే అవకాశాలు ఉన్నాయి. గతం కంటే విద్య పరంగా బాగుంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ మార్పులు ఫలిస్తాయి. వ్యాపారం మంచి అభివృద్ధిలో నడుస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల కంటే సొంత వ్యాపారాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ నవరాత్రుల్లో అమ్మవారికి కుబేర కుంకుమతో ఆరావళి కుంకుమతో అష్టోత్తరం జరిపించండి. అమ్మవారి అనుగ్రహం వలన నష్టపోయిన దనం తిరిగి వస్తుంది. కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉంటాయి. ప్రతిరోజూ అష్టమూలిక తైలంతో లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి సంఖ్య 6 కలిసివచ్చే రంగు బ్లూ.
వృశ్చికం: వృశ్చిక రాశి వారికి ఈ వారం కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. దేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఆరోగ్య పరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు పట్టుదలతో చేసే ఏ ప్రయత్నం అయినా సఫలీకృతం అవుతుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోండి. భూవిక్రయాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు సానుకూలపడతాయి వైద్య వృత్తిలో ఉన్నవారికి, లాయర్లకి, చార్టెడ్ అకౌంటెంట్ వారికి, చిరు వ్యాపారస్తులకు ఈ వారం కాలం అనుకూలంగా ఉంది. వివాహాది ప్రయత్నాలలో మంచి సంబంధం కుదురుతుంది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపార పరంగా కొంత నష్టం వాటిల్లుతుంది. ఏదైనా సరే జీవిత భాగస్వామి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. సొంత నిర్ణయాలు కలిసి రావు. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. కోర్టు సంబంధిత వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉన్నాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. మీరు ఏ కార్యం ప్రారంభించిన ఎలాంటి ఆటంకం లేకుండా నడుస్తుంది. ఈ రాశి వారు ఈ నవరాత్రులలో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించండి. మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయటం మంచిది. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6 కలిసివచ్చే రంగు మెరూన్.
ధనస్సు: ధనస్సు రాశి వారికి ఈ వారం పరిస్థితులు సానుకూలంగా కనిపిస్తున్నాయి. గడచిన కాలం కంటే ఈ వారం వీరికి మంచిగా ఉందని చెప్పవచ్చు. ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఈ వారం సానుకూలంగా కనిపిస్తుంది. ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారు ప్రయత్నాలు ప్రారంభించండి సంబంధిత వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కాంట్రాక్టర్లకు కలిసి వస్తుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకోండి. సాఫ్ట్వేర్ రంగం వారికి చార్టెడ్ అకౌంటెంట్ వారికి సినీ కళా రంగంలోని వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి దైవ అనుగ్రహం చాలా ఉంది. ఈ రాశి వారు కులదైవ నామస్మరణ చేసుకోండి మంచి జరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు అంత అనుకూలంగా లేవు. చదువు మీద కొంత శ్రద్ధ తగ్గుతుంది. పై చదువులకు సంబంధించి మీ సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళటం మంచిది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా చాలా చక్కగా ఉంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. జీవితభాగస్వామితో కూడా చిన్నచిన్న విభేదాలు తలెత్తుతాయి జాగ్రత్త వహించండి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది కాబట్టి అదృష్టం మీద ఆధారపడి ఉండకుండా మీ ప్రయత్నాలు మీరు చేయండి. ఈ రాశి వారు ఈ నవరాత్రులలో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని ఆరాధించండి మంచి జరుగుతుంది. లక్ష్మీ తామర వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయించండి మంచి జరుగుతుంది. ఈ రాశి వారికి కలిసివచ్చే సంఖ్య 5 కలిసివచ్చే రంగు తెలుపు.
మకరం: మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. కొన్ని పనులు నిదానంగా సాగటం మరికొన్ని పనులు మీరు ఊహించిన దానికంటే ముందుగానే పూర్తవటం జరుగుతుంది. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరీ సోదరుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోండి. భూ సంబంధిత వ్యవహారాలు ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. నూతన భూవిక్రయాలు చేస్తారు. హౌసింగ్ లోన్ వ్యాపారానికి సంబంధించిన లోన్లు ఒక కొలిక్కి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువగా స్ట్రెస్ ఉంటుంది కావున కులదైవనామస్మరణ చేసుకోవడం మంచిది. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం చేయడం కూడా మంచిది. ఎలాంటి భయాందోళనలు లేకుండా ముందుకు వెళ్ళండి అంత మంచి జరుగుతుంది. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంబంధిత జీర్ణ సంబంధిత వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి. సమయానికి నిద్రపోవడం సమయానికి ఆహారం తీసుకోవటం చేయండి తద్వారా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. వివాహ సంబంధిత వ్యవహారాలు అంతా అనుకూలంగా లేవు. ఒకవేళ ఏదైనా సంబంధం వస్తే జాతక పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. కొత్త కోర్సులు నేర్చుకునే వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు ప్రతి రోజు ఈ నవరాత్రులలో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారి ఆరాధన చేయడం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసివచ్చే సంఖ్య ఏడు కలిసి వచ్చే రంగు ఎల్లో.
కుంభం: కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎసిడిటీ మరియు గ్యాస్ట్రిక్ వంటి ఆరోగ్య విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ పరంగా కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. నూతన ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి వచ్చిన అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రమే ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో కొంత నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. వారికి మంచి ఉద్యోగం మంచి విద్య అందుతుంది. భూ సంబంధిత విషయ వ్యవహారాలు కోర్టు సంబంధిత విషయ వ్యవహారాలు కొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగం వారికి రియల్ ఎస్టేట్ వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార ప్రారంభానికి సంబంధించి భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంత వ్యాపారాలు చేసే ప్రయత్నం చేయండి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు అంత అనుకూలంగా లేవు. విదేశాలలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం తక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా లేదు. వ్యాపారంలో నష్టాలు వచ్చి అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది. ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులకు కాలం సానుకూలంగా ఉంది. ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ట్రాన్స్ఫర్స్ కావచ్చు ప్రమోషన్స్ కావచ్చు వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజకీయరంగంలో ఉన్న వారికి ఆకస్మిక దూర ప్రయాణాలు, అలాగే పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు నవరాత్రులలో ఆరావళి కుంకుమతో కుబేర కుంకుమతో అమ్మవారిని పూజించడం మంచిది. అలాగే లక్ష్మి తామరవత్తులతో దీపారాధన చేయండి. ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం మంచిది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చేసరికి ఆరు కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ
మీనం: మీన రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. వ్యాపారపరంగా ఉద్యోగ పరంగా చెప్పుకోదగ్గ స్థాయిలో మార్పులు ఏమీ ఉండవు. నూతన వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. భూ క్రయవిక్రయాలకు సంబంధించిన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ రాశి వారు నూతన పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. నూతన పెట్టుబడులు పెట్టాలనుకుంటే బంగారం మీద కానీ మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ భూమి మీద కానీ పెట్టడం మంచిది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రాదు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. నూతన వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నవరాత్రుల్లో మంచి సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి ప్రయత్నం చేయండి. మీకు రావలసిన ధనం సమయానికి చేతికి అందుతుంది. కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశిలో జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశాలలో ఉన్న వారికి వైద్య వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా స్ట్రెస్ కి గురవటం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయటం వంటిది జరుగుతుంది. ఉద్యోగాలలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఏదేమైనాప్పటికీ జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళటం మంచిది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు. మీరు చేసే ప్రయత్నాలు కొంత మేరకు సఫలీకృతం అవుతాయి. ఆరావలి కుంకుమతో కుబేర కుంకుమతో ఈ నవరాత్రులలో అమ్మవారి ఆరాధన చేయటం మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసివచ్చే రంగు తెలుపు.