ఇంఫాల్: ఆర్మీ వాహనంపై ముష్కరుల దాడి చేయడంతో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన మణిపూర్ రాజధాని ఇంపాల్‌లో జరిగింది. అస్సాం రైఫిల్స్‌కు చెందిన వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం ఇంఫాల్ నుంచి బిష్ణుపూర్‌కు ప్రయాణిస్తున్న పారామిలిటరీ దళాల 407 టాటా వాహనం నంబోల్ సబెల్ లీకాయ్ ప్రాంతంలోకి రాగానే ముష్కరుల కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. అనంతరం బలగాలు కాల్పులు జరపడంతో అక్కడి నుంచి ముష్కరులు పారిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు గాయపడిన వారిని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు తరలించారు.
Also Read: 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!