అమరావతి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసిపి నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న గ్రౌండ్‌లో తన అనుచరులతో కలిసి టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి హంగామా సృష్టించారు. జెసి ప్రభాకర్ రెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాడని వైసిపి నేతల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శుక్రవారం తాడిపత్రిలో టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు రెచ్చిపోయారు. వైసిపి నేత, మాజీ కౌన్సిలర్ సూర్య ప్రభాకర్ బాబుపై వేటకోడవళ్లతో దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.
Kethireddy Pedda Reddy vs JC Prabhakar Reddy f
Also Read: 12,452 పోలీసు ఉద్యోగాల భర్తీకి కసరత్తు..!