మన తెలంగాణ/హైదరాబాద్: యువత ఆకాంక్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్య తిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి.రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆ లోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చు ట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు.. ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోడీ గాలికొదిలేశారన్నారు. చైనా, జపాన్, అమెరికా వం టి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమిం చే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ ఛానల్‌లో నిర్వహించిన ‘యువ’ 2025 ది ముంబయి చాప్టర్’ సదస్సులో కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జెన్-జీ ఆలోచనలు, దేశ యువత ఆకాంక్షలు, ప్రభుత్వాల పాత్ర వంటి అంశాలపై తనదైన శైలిలో అద్భుతంగా ప్రసంగించి సభికులను ఆకట్టుకున్నారు. ప్రస్తుత తరం యువత (జెన్-జీ) కేవలం డిజిటల్ మీడియాకే పరిమితం కావద్దని, సమాజం పట్ల అపారమైన బాధ్యతతో పనిచేయాలని అన్నారు. జెన్-జీ శక్తిని తక్కువ అంచనా వేయద్దని పాలకులను హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాల అటవీ భూమిని అమ్మాలని ప్రయత్నిస్తే, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అద్భుతంగా పోరాడి ప్రభుత్వ మెడలు వంచిన విషయాన్ని గుర్తుచేశారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఆ భూముల విక్రయాన్ని నిలిపివేసిందన్నారు. ఇదే జెన్-జీ పవర్ అని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే యువత, రాజకీయాల్లోకి కూడా రావాలని కెటిఆర్ చెప్పారు. రాజకీయాలు యువత భవిష్యత్తును నిర్ణయిస్తున్నప్పుడు, యువత ఎందుకు రాజకీయాలను నిర్ణయించలేరు..? అని యువతకు పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా ముసలితనంలో ఉంటే భారతదేశం మాత్రం యవరక్తంతో ఉరకలెత్తుతోందని అన్నారు. ఈ యువశక్తిని దేశ నిర్మాణానికి వాడుకోవడంలో పాలకులు విఫలమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1985లో చైనా, భారత ఆర్థిక వ్యవస్థలు దాదాపు సమానంగా ఉండేవని, అప్పుడు చైనా తలసరి ఆదాయం 300 డాలర్లు అయితే మనది 500 డాలర్లు అని పేర్కొన్నారు. కానీ, 40 ఏళ్ల తర్వాత చూస్తే, ఇండియా ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్లకే పరిమితం అయితే, చైనా 20 ట్రిలియన్ డాలర్లకు ఎదిగిందని వివరించారు. ఇప్పుడు చైనా తలసరి ఆదాయం 13,000 డాలర్లు అయితే మనది కేవలం 2,700 డాలర్లే అని పేర్కొన్నారు. చైనా మనల్ని ఎలా దాటిపోయిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అమెరికా, యూరప్‌లతో చైనా పోటీపడితే, మనం మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లతో పోల్చుకుని మురిసిపోతున్నామని అన్నారు.
అణుబాంబు దాడితో సర్వనాశనమైన జపాన్, కేవలం 23 ఏళ్లలోనే విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించిందని గుర్తుచేశారు. 1945లో హీరోషిమా, నాగసాకిలపై అణుదాడి జరిగి లక్షలాది మంది చనిపోయినా జపాన్ కుంగిపోలేదన్నారు. ఎన్నో భౌగోళిక అననుకూలతలు ఉన్నా, ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినా వాటన్నింటిని తట్టుకుని అద్భుత ఆవిష్కరణలు, పారిశ్రామికీకరణతో నేడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా జపాన్ ఎదిగిందని పేర్కొన్నారు. జపాన్ సాధించినప్పుడు భారతదేశం ఎందుకు సాధించలేకపోయిందో ప్రతీ ఒక్కరు ఆలోచించాలని కోరారు. గత పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని కెటిఆర్ సోదాహరణలతో వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం తెలంగాణలో ఉందని, ప్రపంచంలోనే అమెజాన్‌కు అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ (టీ-హబ్) హైదరాబాద్‌లో ఉందని, కేవలం 10 సంవత్సరాల్లోనే తెలంగాణ ఇన్ని చేయగలిగినప్పుడు, మిగతా భారతదేశం ఎందుకు చేయలేకపోయిందని నిలదీశారు.
తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోంది
సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల వంటి వారు అమెరికన్ కంపెనీలకు సిఇఒలు అయితే మనం సంతోషిస్తాం కానీ, మన దేశం నుంచి ఒక్క ప్రపంచ స్థాయి ఆవిష్కరణ కూడా రాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కెటిఆర్ అన్నారు. మనకు వెంచర్ క్యాపిటల్ కాదు, అడ్వెంచర్ క్యాపిటల్ కావాలని ఆకాంక్షించారు. మనదేశంలోని 38 కోట్ల జెన్-జీ యువత సరికొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలని పేర్కొన్నారు. పెట్టుబడి లేకపోవడం కాదు..యువత ఊహాశక్తి, ఆశయాలే వారిని ఆపుతున్నాయంటూ యువతలో కెటిఆర్ స్ఫూర్తి నింపారు. ప్రస్తుతం తెలంగాణలో రీకాల్, రిగ్రెట్, రివోల్ట్ నడుస్తోందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును బిఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరుతో ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని చెప్పారు. బిఆర్‌ఎస్‌ను గెలిపించుకోనందుకు బాధపడుతున్నారని, త్వరలోనే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరగబడే అవకాశం ఉందని అన్నారు.
క్షలను ప్రభుత్వాలు విస్మరిస్తే, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు వచ్చే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.టి. రామారావు హెచ్చరించారు. దేశ యువత ఆకాంక్షలు ఆకాశాన్ని తాకుతుంటే, పాలకుల ఆలోచనలు మాత్రం పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల చుట్టూనే తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రజల మౌలిక భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మందిర్-మసీద్, ఎవరు ఏం తింటున్నారు.. ఎవరేం కట్టుకుంటున్నారన్న అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం సాధించారని ఆరోపించారు. దేశ భవిష్యత్తుకు కీలకమైన అభివృద్ధి, ఆవిష్కరణలను మోడీ గాలికొదిలేశారన్నారు. చైనా, జపాన్, అమెరికా వంటి పశ్చిమ దేశాలతో పోటీపడి వారిని అధిగమించే ప్రయత్నం చేయాలే తప్ప, మనకన్నా వెనుకబడిన దేశాలతో పోల్చుకుని సంతృప్తి చెందడం సరికాదని పేర్కొన్నారు.
Also Read: స్టార్ హీరోల రికార్డులు బద్దలు.. ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన హీరోయిన్