GST rate cuts: జీఎస్‌టీ రేట్లను తగ్గించడంతో, భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించింది. దీనితో ఎక్స్-షోరూమ్ ధరల్లో గరిష్ఠంగా రూ. 1.29 లక్షల వరకు తగ్గుదల కనిపించనుంది. సెప్టెంబర్ 22, 2025 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.