మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: నీకు విజన్ ఉందా? నీ నాన్నకు ఉందా? తెలుసు కో కేటీఆర్ … ముందు నీ ఇంటిని, నీ పా ర్టీ ని చక్కబెట్టుకో… మూడున్నరేళ్ల తర్వాత వ చ్చే ఎన్నికల్లో నువ్వు అమెరికాలో ఉం టా వా..ఇండియాలో ఉంటావా? అన్నది కూ డా రాష్ట్ర ప్రజలకు సందేహమే. దమ్ముంటే రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మీ పార్టీ సత్తా చూపించండి అంటూ మంత్రి పొం గులేటి శ్రీనివాస రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు. గురువారం ఖమ్మం జిల్లా పాలేరు సెగ్మెంట్ పరిధిలో ఏదులాపురం మున్సిపాల్టీలో వరంగల్ క్రాస్ రోడ్‌లో ఆయన కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన 80 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరగా వారికి మంత్రి స్వయంగా కండువా కప్పి ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పాలేరులో పొంగులేటి ఎలా గెలుస్తాడో చూస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి ఘాటుగా స్పందించారు. మీ నాయనే (కేసీఆర్) మూడుసార్లు పాలేరుకు వచ్చి ముక్కు నేలకేసి రాసినా ఏం చేయలేకపోయాడని, నువ్వెంత బచ్చాగాడివి.. అని మంత్రి పొంగులేటి మండిపడ్డారు ‘నా మీద నువ్వు నిలబడతావా? నీ మీద బచ్చగాన్ని నిలబెట్టి ఏలా గెలిపిస్తానో చూడాలని మంత్రి పొంగులేటి కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఇటువంటి అహంకారపు మాటల వల్లే ప్రజలు బీఆర్‌ఎస్ కు గుణపాఠం చెప్పారన్నారు. మూడున్నరేళ్ల తర్వాత జరిగే ఎన్నికలనాటికి నువ్వు నిజంగానే ఇండియాలో ఉంటావో, బ్యాగూ, సంచీ సర్దుని విదేశాలకు చెక్కేస్తావో నిర్ణయించడానికి తెలంగాణా ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ ను ఉద్దేశించి మంత్రి పొంగులేటి అన్నారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాటు ప్రజల కలలను ఛిద్రం చేసిందని మండిపడ్డారు. వారి హయంలో ఒకే ఒక లక్ష ఇళ్లు ప్రతి సంవత్సరం కట్టివుంటే, పది లక్షల పేద కుటుంబాలకు గృహాలు అందేవి. కానీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల కమీషన్లలో మునిగిపోయింది.
పాము కోరల్లో విషం పెట్టుకున్నట్టే, వీరంతా ఒళ్ళంతా విషం నింపుకుని తిరుగుతున్నారని ఘాటుగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌కు గట్టి బుద్ధి చెప్తారని, అసెంబ్లీ , లోక్ సభ ఎన్నికల్లోనే ప్రజలు వారిని పక్కన పెట్టేశారని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పేదలకు ఇళ్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు కాంగ్రెస్ పార్టీ వచ్చాక జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, టీపీసీసీ నాయకులు ధరావత్ రామ్మూర్తి నాయక్, బొర్రా రాజశేఖర్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, కళ్ళెం వెంకట్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, ప్రతాపనేని రఘు, భూక్యా సురేష్ నాయక్, వెంపటి రవి, భుజంగ రెడ్డి, వీరా రెడ్డి, భాస్కర్ నాయక్, ప్రద్యుమ్న చారి, సంగయ్య, వెంకటనారాయణ, తోట వీరభద్రం, కర్లపూడి భద్రకాళి, బానోత్ దివ్య, బానోత్ హరి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.అనంతరం మంత్రి తిరుమలాయపాలేం ,ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు.
Also Read: మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్దం