కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది ఓట్లను తొలగించేందుకు ఒక బృందం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. ‘ఓట్ల చోరీ’పై తాను వెల్లడిస్తానని చెప్పిన ‘హైడ్రోజన్ బాంబ్’ సాక్ష్యాలను చూపిస్తూ, తన ఆరోపణలకు 100 శాతం ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.