నిషేధిత సీపీఐ (మావోయిస్టు) తమ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. శాంతి చర్చలకు ముందుకు వస్తున్నామని, అయితే ప్రభుత్వం ఒక నెల రోజుల పాటు ‘కాల్పుల విరమణ’ ప్రకటించి, భద్రతా దళాల ఆపరేషన్లను నిలిపివేయాలని కోరింది. కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో ఈ ప్రకటన వెలువడింది.