Urban Company share price: హోమ్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ అర్బన్ కంపెనీ (Urban Company), భారత స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రారంభాన్ని నమోదు చేసింది. సెప్టెంబర్ 17న షేర్లు 58% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. షేరు ఇష్యూ ధర రూ.103తో పోలిస్తే, బీఎస్‌ఈలో రూ.161, ఎన్‌ఎస్‌ఈలో రూ.162.25 వద్ద ట్రేడింగ్ మొదలైంది.