రైతులను పట్టించుకోని కూటమి సర్కార్ పై జగన్ ఆగ్రహం

jagan fire chandra babu

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో తమ రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనానని రూపాయిన్నరకే కిలో టమోటానా..ఇవేం ధరలు? అని ప్రశ్నించారు. రైతులను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ పై జగన్ఆ గ్రహం వ్యక్తం చేశారు.   రైతు బతకొద్దా? అని కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నారని తమరు కనికరం కూడా చూపడం లేదు కదా? అని విమర్శించారు. ఉల్లి, టమోటా రైతుల వీడియోలతో జగన్ ఎక్స్ లో పోస్టు చేశారు. క్వింటాల్ ఉల్లిని రూ. 1200 కు కొనుగోలు చేయమంటూ.. ప్రకటనల మీద ప్రకటనలు చేశారని, కానీ తూతూ మంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్ లో వేలం వేయించారని మండిపడ్డారు.

ఎవ్వరూ కొనడం లేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని.. కలిగించడానికి తమరు చేసిన ప్రయత్నం కాదా ఇది? అని ఎద్దేవా చేశారు. ఆన్ లైన్, స్టోర్లలో కిలో రూ.29-రూ.32 కు అమ్ముతున్నారు? అని రైతు బజారులలో కూడా కిలో రూ. 25లకు తక్కువ అమ్మడం లేదు కదా? అని రైతులకు ఎందుకు ధర రావడం లేదు? అని జగన్ నిలదీశారు. తమ తప్పు కాదా చంద్రబాబు? అని ఇంత జరగుతున్నా రైతులను ఆదుకోవడానికి.. తమరు కనీసం దృష్టి పెట్టక పోవడం అన్యాయం అని ధ్వజమెత్తారు. అటు టమాటా ధరలు దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదని, కొనేవారు లేక పంటలను రోడ్డు మీదే పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబూ.. తక్షణం రైతుల పంటలను కొనుగోలు చేసి.. వారికిఅండగా నిలబడి మానవత్వాన్ని చూపండి అని జగన్ కోరారు.

Also Read : వక్ఫ్‌పై పాక్షిక స్టే