న్యూఢిల్లీ: భారత్‌లో పర్యటిస్తున్న మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంను మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాహుల్ గాంధీ కలిశారు. భారత్, మారిషస్ మధ్య ‘శాశ్వత స్నేహం’ గురించి వారు చర్చించారని సమాచారం. ‘రెండు దేశాలు, ప్రజల మధ్య శాశ్వత స్నేహం గురించి మేము చర్చించాము’ అని రాహుల్ గాంధీ ఆ తర్వాత వాట్సాప్‌లో పోస్ట్ పెట్టారు. భారత్, మారిషస్ మధ్య ఉన్న గొప్ప సాంస్కృతిక సంబంధాలను ప్రతిబింబిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ గత వారం మారిషస్ ప్రధాని నవీన్‌చంద్ర రామ్‌గులాంకు ఆతిథ్యం ఇచ్చారు. రామ్‌గులామ్ తన ఇండియా పర్యటన సందర్భంగా ముంబై, వారణాసి, అయోధ్య, తిరుపతి, న్యూఢిల్లీలో పర్యటించారన్నది గమనార్హం.
