జమ్ము : అనుకూలమైన వాతావరణం వల్ల బుధవారం నుంచి వైష్ణోదేవి యాత్ర ప్రారంభిస్తున్నట్టు ఆలయ పాలక వర్గం వెల్లడించింది. జమ్ముకశ్మీర్ లోని రియాసి జిల్లాలో త్రికూట పర్వతాలపై ఉన్న ఈ క్షేత్రానికి వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి పడడంతో కొన్ని గంట ల ముందుగా ఆగస్టు 26న ఈ యాత్రను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 22 రోజుల విరామం తరువాత మళ్లీ ప్రారంభమౌతోంది. యాత్రను మళ్లీ ప్రారంభించాలని కోరుతూ రెండు రోజుల క్రితం కట్రా స్థావర శిబిరం వద్ద కొందరు భక్తులు ఆందోళన చేశారు. అంతకు ముందు ఆలయ బోర్డు ఈనెల 14 నుంచి యాత్రను తిరిగి ప్రారంభించాలనుకున్నారు. కానీ ఎడతెరిపిలేని వర్షాలతో వాయిదా పడింది. కొంతమంది భక్తులు నిబంధనలు ఉల్లంఘించి భద్రతా దళాన్ని లెక్క చేయకుండా యాత్రకు బయలుదేరడానికి కూడా సిద్ధమయ్యారు.
