‘జార్జిరెడ్డి’, ‘పరేషాన్’, ‘మసుద’ సినిమాలతో అలరించిన యంగ్ హీరో తిరువీర్ నటిస్తున్న సినిమా ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పీఎం ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై అష్మితా రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘కమిటీ కుర్రాళ్లు’ ఫేం హీరోయిన్ టీనా శ్రావ్య హీరోయిన్‌గా నటిస్తోంది. డైరెక్టర్ రాహుల్ శ్రీనివాస్ రూపొందిస్తున్న ఈ సినిమా టీజర్ మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. కామెడీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ నవ్వులు పూయించేలా ఉంది. సినీ లవర్స్ ను ఈ టీజర్ బాగా ఆకట్టుకుంటోంది. ఇక, నవంబర్ 7న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
