ఐసిసి మహిళల ర్యాంకింగ్స్.. మంధానకు అగ్రస్థానం

దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం ఐసిసి వెల్లడించిన ర్యాంకింగ్స్‌లో మం ధాన 735 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సివర్ బ్రంట్‌ను వెనక్కి నెట్టి మంధాన అగ్రస్థానానికి చేరుకోవడం విశేషం. టీమిండియా తరఫున మంధాన ఒక్కటే టాప్10 బ్యాటింగ్ ర్యాం కింగ్స్‌లో చోటు దక్కించుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీ త్ కౌర్ 12వ ర్యాంక్‌కు పడిపోయింది.

కాగా, సివ ర్ రెండో, లౌరా వాల్‌వర్డ్ (సౌతాఫ్రికా) మూడో, ఎలిసె పెరీ (ఆస్ట్రేలియా) నాలుగో, బెథ్ మూని (ఆస్ట్రేలియా) ఐదో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు . ఇక బౌలింగ్ విభాగంలో సోఫి ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్) టాప్ ర్యాంక్‌ను కాపాడుకుంది. అష్ గార్డనర్, మెగాన్ షట్, కిమన్ గార్త్, అలనా కింగ్‌లు టాప్5లో చోటు దక్కించుకున్నారు. ఇక తొలి ఐదు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకే చెందిన నలుగురు బౌలర్లు ఉండడం విశేషం.