తిరుపతి: జిల్లాలోని పాకాల మండలం (Tirupati Pakala) మూలవంక అడవుల్లో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. లభ్యమైన మృతదేహాల పక్కనున్న గోతుల్లో మరో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను కూడా పోలీసులు గుర్తించారు. లభ్యమైన మహిళ, పురుషుడి మృతదేహాలకు పోలీసులు శవపరీక్షలు చేయించారు. శవపరీక్షలో మహిళ, పురుషుడు హత్యకు గురైనట్లుగా వైద్యులు నిర్ధారించారు. నోటిలో గుడ్డలు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతుడు తమిళనాడు తంజావూర్‌కు చెందిన కలై సెల్వన్ అని వెల్లడించారు.
అయితే మృతురాలు తన భార్య అంటూ భర్త వెంకటేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య, పిల్లలు కూడా కనిపించడం లేదంటూ వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ హత్య ఆస్తి కోసం జరిగిందా.. లేదా పరువు హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలంలో మద్యం సీసాలను పాకాల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. (Tirupati Pakala)
Also Read : మద్యం మత్తులో కన్నతల్లిపై అఘాయిత్యం