రవితేజ వారసుడి నెక్ట్స్‌ మూవీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్

Maadhav Bhupathiraju

టాలీవుడ్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజా. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మాధవ్ భూపతిరాజు(Maadhav Bhupathiraju). మిస్టర్ ఈడియట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మాధవ్. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మారెమ్మ’. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు మాధవ్ పుట్టినరోజు కావడంతో గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్.

ఈ గ్లింప్స్‌లో మాధవ్ (Maadhav Bhupathiraju) ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కబడ్డీ కోర్టులో ఫుల్ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఇక ఈ సినిమాకి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Also Read : శ్రీ వేదాక్షర మూవీస్ ద్వారా ‘ఇడ్లీ కొట్టు’