రానున్న ఎన్నికలలో ‘పాత పెన్షన్’ (OPS) విధానాన్ని అమలు చేసే పార్టీలకే తమ ఓటు అని దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌పీఎస్ ఉద్యోగులు గళమెత్తుతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన ‘పెన్షన్ సంఘర్ష్’ సభలో పాల్గొన్న ఉద్యోగులు ఈ మేరకు ‘ఓట్ ఫర్ ఓపీఎస్’ అంటూ ప్రతిజ్ఞ చేశారు.