గుండ్ల పోచంపల్లిలో వి కన్వెన్షన్ హాల్ గోడ కూలి ఒకరు మృతి

V Convention Hall Gundla Pochampally

గుండ్లపోచంపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గుండ్ల పోచంపల్లి మున్సిపల్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. వి కన్వెన్షన్ ప్రహరీ గోడ కూలి ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం…  గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని వి కన్వెన్షన్ హాల్ పహారి గోడ భారీ వర్షానికి సోమవారం ఉదయం తెల్లవారుజామున కూలింది. దీంతో గోడకు అనుకొని అపర్ణ ఆర్ఎంసి కంపెనీ లో పనిచేస్తున్న కార్మికులు షెడ్ల వేసుకొని నివాసం ఉంటున్నారు. ఒక్కసారి గా షెడ్లపై గోడ కూలడంతో అందులో నిద్రిస్తున్న కార్మికులపై పడడంతో ఒకరు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు ఒరిస్సాకు చెందిన గగన్ (50) గా పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. గాయాలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

 

V Convention Hall Gundla Pochampally

 

Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)