అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉంది: కమిషనర్ రంగనాథ్

Many drains problematic

హైదరాబాద్: చాలా నాలాలు సమస్యాత్మకంగా మారాయని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైదరాబాద్ లో నాలాలు కబ్జా అయ్యాయని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలను తొలిగించాల్సిన అవసరం ఉందని, అక్రమ నిర్మాణాలు నాలాల నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయని ఆవేదనను వ్యక్తం చేశారు. కొన్ని ఇళ్లు తొలగించాలని నిర్ణయించామని అన్నారు. హైడ్రా ఉన్నది ప్రజల కోసమేనని సమస్యలు పరిష్కరిస్తామని కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.

Also Read : కాలేజీలు బంద్ చేస్తే విద్యార్థుల పరిస్థితి ఏంటి?: బండి