హైదరాబాద్: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో ఇడి అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా నిందితులుగా ఉన్న మాజీ ఎంపి మిమి చక్రవర్తికి, నటి ఊర్వశి రౌటేలాకు ఆదివారం ఇడి నోటీసులు జారీ చేసింది. ఈనెల 15న విచారణకు రావాలని మిమి చక్రవర్తికి సమన్లు పంపింది. ఇక, ఊర్వశి రౌటేలాను ఈ నెల16న విచారణకు హాజరుకావాల్సింది నోటీసుల్లో పేర్కొంది. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేసినందుకు సినీ సెలబ్రెటీలు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలపై ఇడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా ఉన్న వీరిని ఇటీవల ఇడి అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు.
