వాళ్లు లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు: ఓం బిర్లా

National Women Empowerment Conference

అమరావతి: మహిళకు గౌరవం ఇవ్వడం ఆది నుంచి వస్తున్న భారత సంప్రదాయం అని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా అని తెలిపారు. భరత భూమిలో మహిళా నాయకత్వం శతాబ్దాలకు ముందే ప్రారంభమైందని అన్నారు తిరుపతిలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా నేతృత్వంలో జాతీయ మహిళా సాధికారత సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఆధ్యాత్మిక, సామాజిక ఉద్యమాల్లో, స్వాతంత్ర్య పోరాటంలోనూ మహిళలు కీలక పాత్ర పోషించారని తెలియజేశారు. సామాజిక బంధనాలను ఛేదించుకుని మహిళలు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని, మహిళల భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదని అన్నారు.

మహిళల అభివృద్ధి కోసం రాజ్యాంగం అనేక నిబంధనలు రూపొందించిందని, మహిళాశక్తి కారణంగానే ఇవాళ ప్రపంచంలోనే ముఖ్య దేశంగా అవతరించిందని కొనియాడారు. అనేక కీలక రంగాల్లో ఇవాళ మహిళలు నాయకత్వ స్థానాల్లోరాణిస్తున్నారని, ఆదివాసీ నేపథ్యం నుంచి వచ్చిన మహిళ ఇవాళ రాష్ట్రపతిగా ఉన్నారని ఓం బిర్లా పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేశామని, రాజకీయాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సైన్యంలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని ఓం బిర్లా స్పష్టం చేశారు.

Also Read : వక్ఫ్ చట్టం సవరణలపై రేపు సుప్రీం రూలింగ్