ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Minakshi Hooda

లివర్‌పూల్: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరో స్వర్ణ పతాకం లభించింది. బాక్సింగ్ 48 కిలోల విభాగం ఫైనల్‌లో మీనాక్షి హుడా (Minakshi Hooda) విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కజకిస్థాన్‌ ప్లేయర్ నాజిమ్ కైజైబేను 4-1 స్ల్పిట్ డెషిషన్‌తో మీనాక్షి ఓడించింది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత నాజిమ్‌కి మీనాక్షి గట్టి పోటీ ఇచ్చింది. ప్రత్యర్థిపై మీనాక్షి పంచ్‌లతో విరుచుకుపడింది. తొలి రౌండ్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. ఆ తర్వాతి రౌండ్‌లో నాజిమ్ కమ్ బ్యాక్ ఇచ్చింది.

రెండో రౌండ్‌లో నాజిమ్.. మీనాక్షిపై (Minakshi Hooda) 3-2 తేడాతో విజయం సాధించింది. మూడో రౌండ్ హోరాహోరిగా సాగింది. నిర్ణీత సమయంలో ఎవరూ పాయింట్లు సాధించకపోవడంతో న్యాయమూర్తులు మీనాక్షికి అనుకూలంగా ఓట్లు వేశారు. దీంతో మీనాక్షి 4-1 తేడాతో స్వర్ణ పతాకం సొంతం చేసుకుంది. ఇదే టోర్నమెంట్‌లో భారత బాక్సర్ లంబోరియా 57 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించింది.

Also Read : తొలి వన్డేలో రాణించిన భారత్.. ఆసీస్‌ల టార్గెట్ ఎంతంటే..