టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం.. పైలట్ ఏం చేశారంటే..

Indigo Filght

లక్నో: ఈ మధ్యకాలంలో విమానాలు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంటున్నాయి కొద్దిరోజుల క్రితమే స్పైస్‌జెట్‌కి చెందిన విమానం టేకాఫ్ సమయంలో టైర్ ఊడిపోయిన విషయం తెలిసిందే. అయిప్పటికీ.. పైలట్ ఆ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. తాజాగా ఇండిగో (Indigo Filght) విమానయాన సంస్థకు చెందిన ఓ విమానం కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.

లక్నో నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం (Indigo Filght) టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే పైలట్ ఇది గమనించి టేకాఫ్‌ను నిలిపివేశారు. విమానాన్ని సురక్షితంగా రన్‌వేపై తిరిగి తీసుకొచ్చారు. విమానంలో ఈ సంకేతక లోపం తలెత్తిన సమయంలో సమాజ్‌వాద్ పార్టీ ఎంపి డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ తర్వాత ప్రయాణికులను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఢిల్లీకి తరలించారు.

Also Read : మణిపూర్‌లో ఇక శాంతి, సౌభాగ్యాలు