మన తెలంగాణ/ఇల్లందు : యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చే తికి రాదన్న మనస్తాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా కోసం సహకార సంఘం చు ట్టూ ఎంత తిరిగినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న మనోవ్యధతో గురువారం గడ్డి మందు తాగాడు. కుటుం బ సభ్యులు అతనిని వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు.
Also Read: నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ