నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారు: కొల్లు రవీంద్ర

Kollu Ravindra comments jagan

అమరావతి: ఎపిలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయాన్ని వైసిపి తట్టుకోలేకపోతుందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కూడా వైసిపి జగన్ మోహన్ కు లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిర్మించని వైద్య కళాశాలలకూ జగన్ పేరు వేసుకున్నారని, మెడికల్ కాలేజీల పేరుతో జగన్ రూ.6 వేల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. టెండర్లు రద్దు చేస్తాం, అభివృద్ధిని కూల్చేస్తామంటూ బెదిరిస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Also Read : ఆర్టిసి బస్సు బోల్తాపడి 10 మందికి గాయాలు