డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

Indian-origin man beheaded

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్‌లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ అనే ఉద్యోగి కత్తితో చంద్రమౌళి తల నరికి చంపాడు. చంద్రమౌళిని చంపుతున్నప్పుడు భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

Also Read: గొర్రెల స్కామ్‌లో బాధితులకు ఇడి నోటీసులు