ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

Pakistan

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు పసికూన ఒమాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్.. అఫ్ఘానిస్థాన్, యుఎఇతో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంది. గత రెండు-మూడు నెలలుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నాడు. ఇక ఒమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్.. మాట్లాడుతూ.. తమ జట్టు సభ్యులు అవకాశాన్ని అందిపుచ్చుకొని.. మంచి ప్రదర్శన చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని వెల్లడించాడు.

తుది జట్లు:
పాకిస్థాన్ (Pakistan): సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, మహ్మద్ హరీస్(కీపర్), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్.

ఒమాన్: జతీందర్ సింగ్(కెప్టెన్), అమీర్ కలీమ్, హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా(కీపర్), షా ఫైసల్, హస్నైన్ షా, మహ్మద్ నదీమ్, జిక్రియా ఇస్లాం, సుఫ్యాన్ మెహమూద్, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాస్తవ.

Also Read : బుమ్రాని ఉతికేస్తాడు.. ఆరు సిక్సులు కొడతాడు: పాక్ మాజీ ఆటగాడు