రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతోందని మంత్రి నాదెండ్ల తెలిపారు. కార్డులో ఏమైనా తప్పులు ఉంటే అక్టోబర్ 31లోపు సరి చేసుకోవాలన్నారు. 3 నెలలు వరుసగా రేషన్ తీసుకోకపోతే కార్డు రద్దవుతుందని చెప్పారు. ఆ తర్వాత సచివాలయాలకు వెళ్లి సరైన సమాచారం ఇస్తే ఆ కార్డును యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు.