న్యూఢిల్లీ : ఎన్నికల ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)దేశవ్యాప్తంగా అక్టోబర్‌లో ఆరంభం కానుం ది. దీనికి సంబంధించిన ప్రకటనను ఎన్నికల సం ఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముగింపునకు ముం దే అధికారికంగా ప్రకటించవచ్చు. ఈ విషయాన్ని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బీహార్‌లో ఇతర చోట్ల చేపట్టిన సర్ ప్రక్రియపై వివాదాలు ర గులుకున్నాయి. పైగా సుప్రీంకోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. వీటితో సంబంధం లేకుండా సర్ ప్రక్రియను తమ ఎన్నికల నిర్వహణ క్రమంలో చేపడుతారని ఎన్నికల సంఘం తెలిపింది. లోక్‌సభ ఎన్నికలు, పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగానే ఓటర్ల జాబితాల సవరణలను చేపట్టడం ఆనవాయితీగా ఉంది. ఈ ఏడాది చివరిలో బీహార్‌లో ఎన్నికలు పూర్తి కావల్సి ఉంది. వచ్చే ఏ డాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధానాధికారులు (సిఇఒ)లతో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక సమావే శం నిర్వహించింది.
ఇందులో ఓటర్ల జాబితా సవరణల విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అన్ని నిబంధనలకు అనుగుణంగా, ఎటువంటి వి వాదాలకు తావు లేకుండా సర్ ప్రక్రియను పూర్తి చే యాల్సి ఉందని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మధ్యలో సర్‌ను ఆరంభించాలనే ప్రతిపాదనకు అన్ని రాష్ట్రాల సిఇఒల నుంచి సమ్మ తి దక్కింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలు, యుటిల లో క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాల సవరణ చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించారు. బీహార్‌లో మాదిరిగానే అన్ని రాష్ట్రాల్లో, యు టిలలో సర్‌ను చేపట్టాలని నిర్ణయించారని అధికారులు తెలిపారు. బుధవారం సంబంధిత విషయం పై సదస్సుతో పాటు వర్క్‌షాప్ కూడా జరిగింది. ఇందులో సర్ నిర్వహణకు అవసరం అయిన మా ర్గదర్శక సూత్రాలను గురించి విశ్లేషించుకున్నట్లు తెలిసింది. రాష్ట్రాల వారీగా ఎప్పటిలోగా సర్ నిర్వహణకు అంతా సిద్ధంగా ఉన్నారనేది తెలియచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల సిఇఒలను ఆరాతీసింది. ఇందుకు తాము ఈ నెలాఖరులోగానే క్షేత్రస్థాయిలో సర్వం సన్నద్ధం అవుతామని వారు చెప్పారు. దీనితో అక్టోబర్ మధ్యలో సర్ నిర్వహణకు రంగం సిద్ధం కావడం ఖాయం అయింది.
క్షేత్రస్థాయిలో సరైన పత్రాలతో ఓటర్ల నమోదు
ఓటర్ల జాబితా సవరణ విషయం అట్టడుగు స్థాయి నుంచి అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసుకుంటూ సాగాల్సి ఉంటుంది. అందరికి తగు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎటువంటి పత్రాలు రూపొందించాలి? సవరణల దశలో నిజమైన ఓటర్ల నిర్థారణ ఏ విధంగా నిర్వహించాలనే విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. సర్ దశల్లో ప్రజలకు పంపిణి చేసే కీలక ఫారాల విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రాల వారిగా , ఆయా ప్రాంతాలలో చెల్లుబాటు అయ్యే రీతిలో ప్రజలకు ఈ ప్రక్రియ గురించి సరైన అవగావహన కల్పించాలని కూడా నిర్ణయించారు. ఓటర్ల నిర్థారణకు స్థానికంగా ఉండే సర్టిఫికెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. వీటిని బట్టి స్థానికతను నిర్థారించుకుంటారు. గిరిజన ప్రాంతాలు, తీర ప్రాంతాలలో వేర్వేరుగా జారీ అయ్యే పత్రాలను లెక్కలోకి తీసుకుని వాటి ద్వారా స్థానికులను ఓటర్ల జాబితాల్లో చేరుస్తారు. అనేక ప్రాంతాలలో స్థానిక మున్సిపాల్టీలు, గ్రామ పంచాయతీలు, స్వయం నిర్ణయాధికారిక మండళ్లు జారీ చేసే నివాస ధృవపత్రాలను లెక్కలోకి తీసుకుంటారు. వీటి ద్వారానే ఓటర్ల జాబితా సమగ్ర స్వరూపం ఏర్పడుతుంది.
Also Read: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
మార్గదర్శకాలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధం
మృతుల పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండరాదు. శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితాల్లో నుంచి తీసివేయాలి. నకిలీ ఓటర్ల తొలిగింపు , భారతీయ పౌరులు కాని వారిని జాబితాల్లో నుంచి తీసివేయడం వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రమంలో పలు వడబోతల తరువాత సమగ్ర నిక్కచ్చి రీతిలో ఉండే ఓటర్ల జాబితాల ఖరారు ఈ సర్ ప్రక్రియ ఏకైక లక్షం అని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. బీహార్ సర్ ప్రక్రియపై కాంగ్రెస్, ఆర్జేడీ , టిఎంసి పార్టీలు తీవ్ర నిరసనకు దిగాయి. కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాందీ దేశవ్యాప్త ఓట్ల
చోరీకి బీహార్ సంకేతం అని విమర్శించారు. బీహార్‌లో ఈ ప్రక్రియతో బిజెపి వ్యతిరేక ఓటర్లను లక్షలాది మందిని జాబితాల్లో నుంచి తొలిగించారని, బడుగు వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేశారని విమర్శించారు. బీహార్‌లో ఓటు హక్కు రక్షణకు ఉద్యమం కూడా చేపట్టారు. అయితే ఎన్నికల సంఘం ఈ విమర్శలను ఖండించింది. ఇవన్నీ కూడా ఎన్నికల సంఘంపై రాజకీయ బురద చల్లడంగా పేర్కొన్నారు. సర్ సమర్థనీయం , సాగుతుంది. అభ్యంతరాలు ఉంటే సరైన పత్రాలతో తమ ముందుకు వస్తే, అని సరైనవే అయితే జాబితాలో సవరణలు చేసేందుకు ఎప్పుడూ సిద్ధమే అని పేర్కొంటూ వచ్చింది. కొన్ని వర్గాల అభ్యంతరాలతో ఈ దేశవ్యాప్త ప్రక్రియ నిలిపివేత కుదరదని స్పష్టం చేశారు.