ఆ వార్తల్లో నిజం లేదు: దానం

Jublihills by Election

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం చాలా ముఖ్యమని ఎంఎల్‌ఎ దానం నాగేందర్ తెలిపారు. జూబ్లీహిల్స్ కోసం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్నారు. ఆదర్శ్‌నగర్‌లోని న్యూఎంఎల్‌ఎ క్వార్టర్స్‌లో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు దానం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ నుంచి తాను పోటీ చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. టికెట్ ఎవరికి కేటాయించిన కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తాను కష్టపడుతానని దానం వివరణ ఇచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వగానే సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని స్థానిక ప్రజలకు సూచించారు.

Also Read: జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?