మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా కోరుట్ల వాసి – ఎవరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ..?

మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ(62) నియమితులైనట్లు తెలిసింది. ఇటీవల జరిగిన ఇంద్రావతి ఏరియా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తెలంగాణలోని కోరుట్ల పట్టణానికి చెందిన తిరుపతి… 4 దశాబ్ధాల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లారు.