ఖాట్మండూ: హిమాలయ రాజ్యం నేపాల్‌లో వరుసగా రెండో రోజూ హింసా త్మక ఆందోళనలు చెలరేగాయి. 20మందికిపైగా పోలీసు కాల్పుల్లో చనిపో వడం, మరికొంత మంది గాయాలపాలు కావడంతో నిరసనకారులు మంగళ వారంనాడు మరింత రెచ్చిపోయారు. నేపాల్ పార్లమెంట్ భవనం, పార్టీ కా ర్యాలయాలతో పాటు రాజకీయ నాయకుల నివాసాలు, వారి బంధువులపై దాడులకు తెగబడ్డారు. ఇళ్లకు, కార్యాలయాలకు నిప్పుపెట్టారు. ఆందోళన కారుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నేపాల్ అధ్యక్షుడు రాంచంద్ర పౌడ్యాల్, ప్ర ధానమంత్రి కెపి శర్మ ఓలీ రాజీనామా ఒకరి తర్వాత ఒకరు గంటల వ్య వధిలో పదవులకు రాజీనామా చేశారు. జనరల్ జెడ్ యువత నిరసనలు హింసాత్మకంగా మారడంతో దేశం అట్టుడికి పోతోంది. అగ్రశ్రేణి రాజకీయనాయకుల నివాసాలపై నిరసనకారులు దాడి చేయడంతో పాటు,
పార్లమెంటును ధ్వంసం చేశారు. దీంతో ప్రధాని ఓలి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినా యువత వెనక్కి తగ్గలేదు. దానికి తోడు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ప్రజల ఆగ్రహానికి విద్యార్థుల నిరసనలు అద్దం పడుతున్నాయి. భద్రతా దళాలు, పోలీసులను మోహరించినా, కర్ఫ్యూ విధించినా, ప్రజాగ్రహం ముందు పనిచేయలేదు. ప్రజలు కీలకప్రాంతాలలో గుమికూడి నిరసనలు తెలిపారు. కాగా రాజీనామా చేసిన కెపి శర్మ ఓలీ దుబాయిలో తలదాచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో ఆయన ఎక్కడికీ వెళ్లరని, ఖాట్మండూలోనే ఉంటారని ఆయన వర్గాలు వెల్లడించడం విశేషం.
వీధుల్లో ఆర్థికమంత్రిని తన్ని..
పలు చోట్ల నిరసనకారులు అమానవీయంగా ప్రవర్తించారు. మంత్రులను వీధుల్లో వెంబడించి మరీ దాడులకు తెగబడ్డారు. ఖాట్మండూ వీధుల్లో కనిపించిన ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పౌడ్యాల్ ఉరికించి మరీ కొట్టారు. ఓ నిరసనకారుడు ఎగిరి తన్నడంతో ఆయన కిందపడ్డారు. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతూ ఓ గొడపై పట్టుతప్పి పడిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ దృశ్యాలు చూపరులను ఆవేదనకు గురిచేశాయి. మాజీ ప్రధాని పుష్పకుమార్ దహల్, కమ్యునికేషన్ శాఖ మంత్రి పృధ్వీ సుబ్బ గురుంగ్, మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్ తో సహా పలువురి ఇళ్లపైన కూడా దాడి చేశారు. ఖాట్మండులోని కలంకి, కాలిమతి,
తహచల్, బనేశ్వర్, లలిత్పూర్ జిల్లాలోని చ్యసల్, చాపగౌ, థెగో వంటి ప్రాంతాలలోనూ భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఖాట్మండూలోని బుదానీలకంఠలో మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బా ఇంటిపైనా దాడిచేసి, ధ్వంసం చేశారు. ఆయనతో పాటు ఆయన భార్యపై దాడి చేసి చితకబాదారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, మంత్రులు, ప్రముఖులకు ఒకే చోట సైన్యం ప్రత్యేక రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ ప్రధానమంత్రి జాలానాథ్ కనాల్ భార్య రబీ లక్ష్మీ చిత్రకార్‌పై దాడి చేసిన నిరసనకారులు ఆమెకు నిప్పంటించారు. తీవ్ర గాయాలు కావడంతో ఆమె మరణించారు. ఆస్పత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అధ్యక్షుడు పౌడ్యాల్ ఆస్తులను కూడా నిరసనకారులు లక్షంగా ఎంచుకుని ధ్వంసం చేశారు.
ఖాట్మండూ విమానాశ్రయంలో సేవలు నిలిపివేత..
సోమవారం నిరసనకారులపై పోలీసు కాల్పుల్లో 19 మంది చనిపోవడంతో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వేలాది మందిగా ఆయన కార్యాలయంలోకి దూసుకు వచ్చిన కొద్ది సేపటికి ఓలి రాజీనామా చేసినట్లు అధికారులు ప్రకటించారు. నేపాల్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్ననేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు అధ్యక్షుడికి పంపిన లేఖలో ఓలి తెలిపారు. ఆయన రాజీనామాను అధ్యక్షుడు ఆమోదించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ బద్ధమైన, రాజకీయ పరిష్కారం సాధించేలా మార్గం సుగమం చేసేందుకే తాను పదవినుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు.భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఖాడ్మండూ లోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అన్ని విమానసేవలను నిలిపివేశారు. ఓలీ రాజీనామాకు కొన్నిగంటలముందు నిరసనకారులు బాల్కోట్ లోని ఓ నాయకుడి ప్రైవేటు ఇంటికి నిప్పు పెట్టారు. కొంత కాలంగా ప్రభుత్వంలో అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న జనరల్ జెడ్ గ్రూప్ ఈ మధ్య సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తన దాడిని పెంచింది. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వ పెద్దలు వాటిని నిషేధించడంతో ప్రజాగ్రహం వెల్లువెత్తింది.
నిరసనలు మాని చర్చలకు రండి : సైన్యం
ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా చేసిన నేపథ్యంలో నిరసనలు విరమించి చర్చలకు రావాలని నేపాల్ సైన్యం, ఇతర భద్రతా ఏజెన్సీల చీఫ్ లు విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఓలీ నేపాల్ అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడంతో ఆందోళన కారులు ఆస్తులు, ప్రాణ నష్టం కలిగించవద్దని, తమ నిరనలు విరమించి, కాస్త సంయమనం పాటించాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని వారు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనలపై నేపాల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దేల్, నేపాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏక్ నారాయణ్ ఆర్యల్, హోం కార్యదర్శి గోకర్ణ దవాడి, సాయుధ పోలీసు దళం చీఫ్ రాజి ఆర్యల్, ఇన్ స్పెక్టర్ జనరల్ చంద్ర కుబేర్ ఖాపుంగ్, జాతీయ భద్రతా విభాగం చీఫ్ హుత్రాజ్ థాపా ఉన్నారు.