తిరుమలలో దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Tirumala darshan devotees

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 19 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం 70,828 మంది భక్తులు  శ్రీవారిని దర్శించుకున్నారు. 26,296 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.07 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.