ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

C. P. Radhakrishnan

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం ఓటర్ టర్నౌట్‌ను సూ చిస్తుంది. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీ యే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టి స్ బి సుదర్శన్ రెడ్డి పోటీ చేశారు. ఉప రాష్ట్రపతి కోటా విజయానికి కావాల్సిన ఓట్లు 377 కాగా, రాధాకృష్ణన్‌కు 452 ఓ ట్లు, సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొ త్తం ఓట్లలో 15 చెల్లనివిగా గుర్తించారు. దీంతో 152 ఓట్ల మెజార్టీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్టు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. ఈ విజయం ఆయన రాజకీయ అనుభవాన్ని, ఎన్డీయే కూటమి బలాన్ని ప్రతిబింబించింది. అదే సమయంలో కొంతమంది ప్రతిపక్ష ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలో చీలికలు ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. పార్లమెంట్ నూతన భవనం లోని ఎఫ్ 101 వసుధలో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ , సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. సాయంత్రం 6 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. రాత్రి 7.30 కి ఫలితాలు ప్రకటించారు.

తమిళనాడు ‘మోదీ’గా పేరు
భారత 17 వ ఉప రాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ . 1957 అక్టోబరు 20న తమిళనాడు లోని తిరుప్పూర్‌లో సీకే పొన్నుస్వామి, కె. జానకి దంపతులకు ఆయన జన్మించారు. 16 ఏళ్లకే ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ఆయనను తమిళనాడు మోడీ అని పిలుస్తుంటారు. తూత్తుకుడి లోని విఒ చిదంబరం కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ అందుకున్నారు. 1974లో ఆయన జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీకి ఎన్నికయ్యారు. 1980 లో బీజేపీలో చేరారు. అటల్ బిహారీ వాజ్‌పాయ్‌కు సన్నిహితుడు. ప్రస్తుతం ఆయన తమిళనాడు గవర్నర్‌గా కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆయన జులై 31, 2024 రెంయి మహారాష్ట్ర గవర్నర్‌గా సేవలందించారు. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళసై సౌందర్ రాజన్

రాజీనామా చేయడంతో ఆమె స్థానంలో తెలంగాణ పుదుచ్చేరి గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పలు పార్లమెంట్ కమిటీలకు ఛైర్మన్‌గా, సభ్యుడిగా పనిచేశారు. స్టాక్‌మార్కెట్ కుంభకోణంపై విచారణకు సారథ్యం వహించారు. బీజేపీ నుంచి 1998 లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లోనూ మళ్లీ గెలుపొందారు. 2004 నుంచి మూడేళ్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నారు. . 93 రోజుల పాటు 19000 కిలోమీటర్ల మేర రథయాత్ర చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి చెందిన కె. సుబ్బరాయన్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇటీవల జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా ప్రకటించింది. తమిళనాడు నుంనచి ఉప రాష్ట్రపతి పీఠం అధిష్ఠించనున్న మూడో వ్యక్తిగా రాధాకృష్ణన్ గుర్తింపు పొందారు.

మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తా : సుదర్శన్ రెడ్డి
మరింత బలంగా సైద్ధాంతిక పోరాటం కొనసాగిస్తానని ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపే కాదు. ఓటమిని స్వీకరించాలన్నారు. ఫలితాలు నాకు అనుకూలంగా రాలేదు. ప్రజస్వామ్యబలం , కేవలం విజయంలో మాత్రమే లేదు. చర్చలు, నిరసన ద్వారా కూడా ప్రజాస్వామ్యం బలపడుతుంది. విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు శుభాకాంక్షలు అని తెలిపారు.

రాధాకృష్ణన్‌కు అమిత్‌షా అభినందనలు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన రాధాకృష్ణన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌సా శుభాకాంక్షలు తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన నాయకుడని ఆయన కొనియాడారు.
ఖర్గే శుభాకాంక్షలు
రాధాకృష్ణన్‌కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుభాకాంక్షలు తెలియజేశారు. అదే సమయంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోరాటానికి సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది ఎన్నిక మాత్రమే కాదు. ఇది సిద్ధాంతాల యుద్ధం. పార్లమెంట్ సంప్రదాయాలను, రాధాకృష్ణన్ కాపాడతారని ఆశిస్తున్నా. ప్రతిపక్షాలకు సరైన సమయం కేటాయిస్తారని ఆశిస్తున్నా” అని పేర్కొన్నారు.